
Priyanka Chopra SSMB29:
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం SSMB 29. ఈ సినిమా ద్వారా మహేష్ బాబు, ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్ తొలిసారి ప్రేక్షకులను అలరించనుంది. భారీ అంచనాల మధ్య హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో చిత్రీకరణ కొనసాగుతోంది.
ఈ సినిమా ప్రత్యేకతలలో ఒకటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ Priyanka Chopra కూడా ఇందులో నటిస్తోంది. మహేష్ బాబుతో కలిసి కీలక సన్నివేశాల్లో ఆమె కనిపించనుంది. ప్రియాంక భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం కొన్ని రోజులు షూటింగ్‌కు బ్రేక్ తీసుకుని, ముంబై వెళ్లారు. ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహం నేపథ్యంలో ఈ విరామం తీసుకున్నారని తెలుస్తోంది.
అయితే ఆమె లేకున్నా సినిమా షూటింగ్ మాత్రం ఆగడం లేదు. రాజమౌళి ఇప్పటికే మహేష్ బాబుతో కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారు. ప్రియాంక తిరిగి హైదరాబాద్ వచ్చాక ఆమె సీన్స్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. కథను విజయేంద్ర ప్రసాద్ అందించగా, సంగీతం ఎమ్‌ఎమ్ కీరవాణి సమకూరుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా, ఓ మహా అడ్వెంచర్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహేష్ బాబు అభిమానులు, సినిమా ప్రేక్షకులందరూ SSMB 29 గురించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని లుక్‌లో కనిపించనున్నారు.