HomeTelugu Trending'నారప్ప'కు జోడి కట్టిన యంగ్‌ హీరోయిన్‌

‘నారప్ప’కు జోడి కట్టిన యంగ్‌ హీరోయిన్‌

7 23
విక్టరి వెంకటేష్‌ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ సినిమా రూపొందుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్ వారు, కలైపులి థాను కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని ‘రెడ్ డిసర్ట్’లో జరుగుతోంది. కీలకమైన కొన్ని పోరాట సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా ప్రియమణి నటిస్తోంది. మరో హీరోయిన్‌గా ‘రెబా మోనికా జాన్’ను తీసుకున్నారు.

మలయాళంలో ‘రెబా మోనికా జాన్’ కి మంచి క్రేజ్ వుంది. తెలుగులో ఆమెకి ఇదే తొలి సినిమా. ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగులో ఆమె జాయిన్ కానుంది. వెంకటేశ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఆమెపై చిత్రీకరించనున్నారు. ‘నారప్ప’ విజయవంతమైతే ఈ సుందరి ఇక్కడ బిజీ అయ్యే అవకాశాలు వున్నాయి. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu