HomeTelugu Trendingమహేష్‌కి తల్లిగా నటించడానికి రెడీ: రేణు దేశాయ్‌

మహేష్‌కి తల్లిగా నటించడానికి రెడీ: రేణు దేశాయ్‌

9టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కి అమ్మగా నటించాలనుకుంటుంది రేణు దేశాయ్‌. లాక్‌డౌన్‌ కారణంగా అందరు ఇంటికే పరిమితం అయిపోయారు. బోర్ కొట్టకుండా సెలబ్రెటీలు అప్పుడప్పుడూ ఆన్‌లైన్‌లో అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడు కూడా రేణు దేశాయ్ ఇదే చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్‌కి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

మహేష్‌, ప్రభాస్ వంటి హీరోలకు తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా అని నెటిజన్లు అడిగారు. దానికి రేణు దేశాయ్ కూడా చాలా కూల్‌గా సమాధానమిచ్చింది. హీరోల చిన్నతనంలోని పాత్రలకు తల్లి పాత్ర చేయడానికి సిద్ధమేనని సమాధానం చెప్పింది రేణు. ఇక మహేష్‌ బాబు లాంటి హీరోలకు తల్లి పాత్రలో బాగా చూపింగలరనే నమ్మకం దర్శకులకు ఉంటే మాత్రం తనకు నటిచేందుకు సిద్ధమేనని రేణు తెలిపింది. అన్నట్లు మహేష్ బాబు కంటే వయసులో 8 ఏళ్లు రేణు దేశాయ్ చిన్నది. తామంతా నటులం అని.. ఎలాంటి పాత్ర అయినా పోషించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పింది రేణు. గతంలో పవన్‌ కల్యాణ్‌ సుస్వాగతంలో నటించిన దేవయాని కూడా నాని సినిమాలో మహేష్‌కి తల్లిగా నటించి మెప్పించన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu