HomeTelugu Trendingపవన్‌ కల్యాణ్‌ సీఎం కావడంపై రేణూ దేశాయ్‌ స్పందన

పవన్‌ కల్యాణ్‌ సీఎం కావడంపై రేణూ దేశాయ్‌ స్పందన

Renu Desais reaction on Pa 1

టాలీవుడ్‌ సీనియర్‌ నటి రేణూ దేశాయ్ నటించిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ హీరోగా నటించిన ఈసినిమా ఇటీవలే విడులైంది. ఈ చిత్రంలో ప్రముఖ సంఘసంస్కర్త హేమలతా లవణం పాత్రను రేణూ దేశాయ్ పోషించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు రేణూ స్పందించారు. ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసని, దేవుడు ఏం రాసిపెడితే అది జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో అభిప్రాయం చెప్పడానికి నేనెవర్ని? అంటూ ప్రశ్నించారు.

ఈ అంశంలో తాను ఎటువైపూ మొగ్గు చూపడంలేదని, తాను తటస్థంగా ఉంటానని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. ఇటీవల కూడా తాను ఉన్న నిజాలే చెప్పానని, ఈ రోజు కూడా అదే చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తికి మద్దతుగా మాట్లాడడమో, ఈ వ్యక్తికి మద్దతుగా మాట్లాడడమో చేయనని, తనకు ఏమనిపించిందో అదే చెబుతానని వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu