రివ్యూ: సాహసం శ్వాసగా సాగిపో

బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
నటీనటులు: నాగచైతన్య, మంజిమా మోహన్, బాబా సెహగల్, రాకేందు మౌళి తదితరులు
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్
సినిమాటోగ్రఫీ: డాన్ మకర్తుర్
ఎడిటింగ్: ఆంథోనీ
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
దర్శకత్వం: గౌతమ్ మీనన్

naga-chaitanya-saahasam-swaasaga-saagipo-movie-posters-2

ఏ మాయ చేసావే చిత్రంతో నాగచైతన్యను లవ్ స్టోరీస్ లో నటించడానికి కేరాఫ్ అడ్రెస్ గా మార్చేశాడు దర్శకుడు గౌతమ్ మీనన్. ఇప్పుడు సాహసం శ్వాసగా సాగిపో అంటూ చైతుని మరో కొత్త కోణంలో చూపించడానికి సిద్ధమయ్యాడు. గతేడాది విడుదల కావల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

images

కథ:
చదువు పూర్తి చేసి సరదాగా స్నేహితులతో కాలక్షేపం చేస్తూ.. ఓ ట్రిప్ కి వెళ్లొచ్చి జాబ్
చూసుకోవాలనుకుంటాడు రజినీకాంత్(నాగచైతన్య). ఈలోగా తన చెల్లెలి స్నేహితురాలు
లీలా(మంజిమా మోహన్)ను చూసి మొదటి చూపులోనే ఇష్టపడతారు. ఒక కోర్స్ విషయమై లీలా, రజినీకాంత్ ఇంట్లోనే కొన్ని రోజులు ఉండాల్సివస్తుంది. తన ట్రిప్ సంగతి తెలుసుకున్న లీలా, రజినీకాంత్ తో కలిసి బైక్ మీద కన్యాకుమారి వరకు ట్రిప్ కు బయలుదేరుతుంది. ఆ జర్నీలో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ట్రిప్ చూసుకొని తిరిగి ఇంటికి వెల్తోన్న సమయంలో వీరు డ్రైవ్ చేస్తోన్న బైక్ ను ఓ లారీ వచ్చి ఢీ కొడుతుంది. దీంతో తనెక్కడ చనిపోతానో.. అనే భయంతో లీలాను ప్రేమిస్తున్నట్లుగా తనతో చెప్పేస్తాడు. లీలా అతడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేసి వెళ్లిపోతుంది. రెండు రోజుల తరువాత హాస్పిటల్ కు ఫోన్ చేసి తన పేరెంట్స్ ను ఎవరో పొడిచినట్లుగా, తనను కూడా చంపడానికే లారీను పంపినట్లు చెబుతుంది. ఆ మాటలు విన్న రజినీకాంత్, లీలాను వెతుక్కుంటూ వెళ్తాడు. లీలాను, తన కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది ఎవరు..? వారి బారి నుండి లీలాను రజినీకాంత్ కాపాడగలిగాడా..? లీలా అతడ్ని ప్రేమిస్తుందా..? అనే అంశాలతో సినిమా నడుస్తుంది!
ప్లస్ పాయింట్స్:
సంగీతం
కథ
నాగచైతన్య
మైనస్ పాయింట్స్:
ఎడిటింగ్
సెకండ్ హాఫ్

naga-chaitanya-saahasam-swaasaga-saagipo-movie-posters-3

విశ్లేషణ:
సినిమా మొదటి భాగం పూర్తి లవ్ స్టోరీ, పాటలతో సాఫీగా సాగిపోతుంది. సడెన్ గా ఇంటెర్వెల్ బ్యాంగ్ నుండి యాక్షన్ స్టోరీ మొదలవుతుంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్న ఓ వ్యక్తి తను చేసిన తప్పు బయటకు రాకుండా ఉండడానికి ఒక కుటుంబాన్ని చంపాలనుకుంటాడు. ప్రేమించిన అమ్మాయి ఆపదలో ఉందని తెలుసుకొని తనను కాపడానికి ఏమీ తెలియని ఓ సాధారణ యువకుడు చేసే సాహసమే ఈ సినిమా. గౌతమ్ మీనన్ స్టయిల్ లో ఉండే ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్, ఫైట్స్ వలన అక్కడక్కడా బోర్ కొట్టినా.. ఫైట్స్ ను కూడా రియలిస్టిక్ గా చూపించడంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అటు లవ్ సీన్స్ లో, ఇటు యాక్షన్ సీన్స్ లో చైతు తన మార్క్ పెర్ఫార్మన్స్ చూపించాడు. ఈ సినిమా అతడు యాక్షన్ జోనర్ సినిమాలు కూడా చేయగలడని నిరూపించింది. మంజిమా మోహన్ కు తెలుగులో ఇది మంచి డెబ్యూ ఫిల్మ్ అవుతుంది. ఏదో హీరోయిన్ అన్నట్లు కాకుండా ఓ సాధారణ అమ్మాయిని చూపించినట్లే స్క్రీన్ మీద ప్రెజంట్ చేశారు. రాకేందు మౌళి, చైతు స్నేహితుడి పాత్రలో అతి చేసినట్లు అనిపించినా.. అక్కడక్కడా ప్రేక్షకులను నవ్విస్తాడు. బాబా సెహగల్ నెగెటివ్ రోల్ లో బాగా నటించారు. సినిమా ఎక్కువగా ఈ పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. రెహ్మాన్ అందించిన ప్రతి పాట సినిమాకు ప్లస్ అయింది. అలా మరో పది పాటలు వచ్చినా.. వినేంతగా ప్రేక్షకులు మ్యూజిక్ కు కనెక్ట్ అయిపోతారు. సాహిత్య పరంగా, విజువల్ గా పాటలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. గౌతమ్ మీనన్ ను రాసుకున్న డైలాగ్స్, కథను తెరపై ఆయన ఎగ్జిక్యూట్ చేసిన విధానం మరోసారి దర్శకుడిగా అతడి ప్రతిభను
నిరూపించింది. నిర్మాణ విలువలు బావున్నాయి.
రేటింగ్: 3/5