HomeTelugu Trendingరాజమౌళి భద్రత పెంచుకో.. అసూయతో రగిలిపోతున్నారు: ఆర్జీవీ

రాజమౌళి భద్రత పెంచుకో.. అసూయతో రగిలిపోతున్నారు: ఆర్జీవీ

rgv shared rrr video and pr
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్ వైరల్‌ అవుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా యూనిట్ ఇటీవల ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోను రీ ట్వీట్ చేసిన వర్మ.. ఓ భారతీయ సినీ దర్శకుడు ఇలాంటి క్షణాలను అనుభవిస్తాడని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో దాదాసాహెబ్ ఫాల్కే నుంచి రాజమౌళి సహా ఇప్పటి వరకు ఎవరూ ఊహించి ఉండరని పేర్కొంటూ ప్రశంసలు కురిపించాడు.

అలాగే, మరో ట్వీట్‌లో రాజమౌళిని భద్రత పెంచుకోమని కోరాడు. దేశంలోని కొందరు దర్శకులు స్వచ్ఛమైన అసూయతో రగిలిపోతున్నారని, రాజమౌళిని అంతమొందించేందుకు రెడీ అవుతున్నారని, అందులో తానూ ఒకడినని సరదాగా బెదిరించారు. తానేదో తాగి ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని బయటపెట్టేస్తున్నానంటూ తన ట్వీట్ లో చమత్కరించారు. ఇప్పుడీ ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu