HomeTelugu Trendingనితిన్ సినిమా హిందీలో రీమేక్..హీరో ఎవరంటే..?

నితిన్ సినిమా హిందీలో రీమేక్..హీరో ఎవరంటే..?

4 18
ఈ మధ్య కాలంలో తెలుగులో పాపులర్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అర్జున్‌ రెడ్డి సినిమా బాలీవుడ్‌లో కబీర్‌సింగ్‌గా సంచలన విజయం నమోదు చేయడం తెలిసిందే. ఆ తర్వాత తెలుగు సినిమాలు హిందీలో రీమేక్‌ వేగం పెరిగిందనే చెప్పాలి. ఇప్పటికే ఆర్‌ఎక్స్‌ 100, ఓ బేబీ సినిమాలు రీమేక్ కాబోతున్నాయి. తాజాగా భీష్మ సినిమాకూడా ఆ జాబితాలో చేరినట్టు తెలుస్తోంది. తెలుగులో వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను రణబీర్ కపూర్‌ హీరోగా హిందీలో రీమేక్‌ చేయడానికి కరణ్‌ జోహార్ ప్రయత్నాలు చేస్తున్నారట. రణబీర్ కపూర్‌ బిజీగా ఉండటంతో అర్జున్‌ కపూర్‌తో భీష్మ రీమేక్ చేస్తున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu