HomeTelugu Big Stories'రైజ్ ఆఫ్ శ్యామ్' ప్రోమో

‘రైజ్ ఆఫ్ శ్యామ్’ ప్రోమో

Rise of Shyam Promo

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో ఈ సినిమా 1970 లో కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక తాజాగా ఈ చిత్రం మొదటి సింగిల్ ని మేకర్స్ దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో ఒక ప్రోమో ను విడుదల చేసిన మేకర్స్ ఈ పూర్తి పాటను నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ ప్రోమోలో కలకత్తాలో ఒక బెంగాలీ యువకుడు ఒక లెజెండ్ గా ఎదిగిన వైనాన్ని కల్లకలు కట్టినట్లు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. బెంగాలీ దాదాగా నోట్లో సిగార్ తో, తీక్షమైన చూపుతో నాని లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu