HomeTelugu Trending'అన్‌స్టాపబుల్‌'పై రోజా సంచలన వ్యాఖ్యలు

‘అన్‌స్టాపబుల్‌’పై రోజా సంచలన వ్యాఖ్యలు

Roja comments on unstoppabl
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్‌’. ఈ షో మొదటి సీజన్‌ సూపర్‌ హిట్‌ కావడంతో రెండో సీజన్‌ కూడా ఇటీవలే ప్రారంభమై డబుల్‌ సందడితో దూసుకుపోతుంది. కాగా మొదటి సీజన్‌లో కేవలం సినీ రంగానికి చెందిన ప్రముఖులే రాగా.. రెండో సీజన్‌లో మాత్రం రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు. దాంతో ఈ రెండో సీజన్‌పై కాస్త విమర్శలు వస్తున్నాయి. ఇక త్వరలో స్ట్రీమింగ్‌ కానున్న పవన్‌ కళ్యాణ్ ఎపిసోడ్ మీద రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్‌ అయ్యి.. వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. జనవరి చివరి వారంలో ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.

తాజాగా ఈ షోపై నటి, ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ భవాని ఐలాండ్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో రోజాను మీడియా ప్రతినిధులు అన్ స్టాపబుల్ షోకు వెళ్లే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. చచ్చినా వెళ్లనని రోజా చెప్పారు. గతంలో అయితే అన్‌స్టాపబుల్‌ షోకి వెళ్లాలని ఆశగా ఉండేదని, ఎందుకంటే బాలకృష్ణతో కలసి ఏడు సినిమాలు చేశానని, బాలయ్యది తనది హిట్‌ కాంబినేషన్ అని చెప్పారు. అంతేకాకుండా తనను రెండు సార్లు ఈ షోకు పిలిచారని, కానీ కరెక్ట్‌గా వాళ్లు పిలిచిన టైమ్‌లో తనకు అసెంబ్లీ సెషన్స్‌ జరుగుతున్నాయని వెల్లడించారు. మొన్న బాలకృష్ణ, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ అన్‌స్టాపబుల్‌ చూశాక, జీవితంలో అన్‌స్టాపబుల్‌ షోకు పోకూడదని అనిపించిందని తెలిపారు. అయితే ఇప్పుడు పిలిచిన అస్సలు వెళ్లనని చెప్పుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu