HomeTelugu Trendingసెప్టెంబర్‌లో శ్రీకాంత్ కొడుకు రోషన్ 'పెళ్లి సందడి'

సెప్టెంబర్‌లో శ్రీకాంత్ కొడుకు రోషన్ ‘పెళ్లి సందడి’

Roshan Pelli Sandadi

హీరో శ్రీకాంత్‌తో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గతంలో చేసిన ‘పెళ్లి సందడి’ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో శ్రీకాంత్ తనయుడితో కలిసి దర్శకేంద్రుడు మరోసారి పెళ్లి సందడిని చేయబోతున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ సినిమాను మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు.

Roshan and Sree Leela Pelli

ఈ సినిమాతో రాఘ‌వేంద్ర‌రావు శిష్యురాలు గౌరి రోణంకి ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇందులో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోష‌న్, హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మిగిలిన పాట‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ను త్వ‌ర‌లోనే రిలీజ్ చేయనున్నట్లు దర్శకురాలు గౌరి రోణంకి వెల్లడించారు. సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu