HomeTelugu Trendingవైష్ణవ్‌ తేజ్‌- క్రిష్‌ మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ వచ్చేది ఎప్పుడంటే!

వైష్ణవ్‌ తేజ్‌- క్రిష్‌ మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ వచ్చేది ఎప్పుడంటే!

vaishnav tej and krish movi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో వైష్ణవ్ తేజ్ – ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ రెండో ప్రాజెక్ట్ అయిన ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్‌ చేయని ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ రోజు ఉదయం దర్శకుడు క్రిష్ తన ట్విట్టర్‌లో ఈ సినిమా అప్డేట్ ను ప్రకటించారు.

ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. అందులో వైష్ణవ్ తేజ్‌తో పాటు గ్రామీణులు, పశువులు, గొర్రెలతో కలిసి అడవిలో నడుస్తుండగా… సూర్యుడు అస్తమించబోతున్నట్లు ఉంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆగస్టు 20న ఉదయం 10:15 గంటలకు లాంచ్ చేస్తామని క్రిష్ ప్రకటించారు. ఈ సినిమాకు జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి రాసిన “కొండపొలం” నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu