HomeTelugu Trendingఆలియా భట్ విషయంలో జక్కన్నకు కొత్త తలనొప్పి..

ఆలియా భట్ విషయంలో జక్కన్నకు కొత్త తలనొప్పి..

3 24

దర్శక ధీరడు రాజమౌళి డైరెక్షన్‌లో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఆలియా భట్ ఒలీవియా మోరిస్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తుండగా.. ఆయనకు జంటగా బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ కనిపించనున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి అలియా తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అలియా భట్ సినిమాలు బీహార్ రాష్ట్రంలో విడుదల కానివ్వమని వార్తలొస్తున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్ కంగారు పడుతుందట. బీహార్ ప్రజలు తెలుగు సినిమాలను కూడా ఆదరిస్తారు. ఇప్పుడు ఇలా ఆలియా సినిమాలు బ్యాన్ చేస్తారనే సరికి బీహార్ రాష్ట్రములో ఆర్ఆర్ఆర్ కూడా విడుదల అయ్యే అవకాశం లేదు. ఆలియా వలన బీహార్ మార్కెట్ లాస్ వస్తుందని చిత్రయూనిట్ వాపోతున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu