HomeTelugu Newsతమిళంలో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ లేదట..!

తమిళంలో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ లేదట..!

12 16
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రాన్ని అనేక భాషల్లో నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఎలాంటి చిన్న వార్త అయినా అది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. లీకేజీ వంటివి దొరికితే దానిని ట్రెండ్ చేయడంలో ఫ్యాన్స్ ముందుంటారు. అసలే అభిమానులు ఆతృతతో ఉన్నారు. అప్పుడెప్పుడో ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు. ఆ తరువాత ఎలాంటి అప్డేట్ లేదు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంగా… రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్ మూవీని తమిళంలో షూటింగ్ చేస్తున్నారా లేక డబ్ చేస్తున్నారా అనే విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ దీనికి సంబంధించిన ఓ వార్తసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను తమిళంలో షూట్ చేయకుండా డబ్బింగ్ చేస్తారని తెలుస్తోంది. దేశంలోని దాదాపు 10 భాషల్లో ఈ సినిమా డబ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu