‘కలర్ ఫోటో’ సినిమాపై జగపతిబాబు ప్రశంసలు

‘కలర్ ఫోటో’ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంటుంది. రవితేజ,విజయ్ దేవరకొండ, నాని, మారుతి వంటి వారు ఇప్పటికే ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా జగపతిబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఈ సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఈ సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని చెప్పారు. డైరెక్టర్‌ సందీప్ తను ఏంటో నిరూపించుకున్నాడని జగపతిబాబు అన్నారు. సుహాన్ ఒక నటుడిగానే కాకుండా, ఒక హీరోగా కూడా నిరూపించుకున్నాడని ప్రశంసించారు. సినిమా హిట్ కావడానికి స్టార్ డమ్, భారీ బడ్జెట్ మాత్రమే కారణం కాదని ఈ చిత్రం నిరూపించిందని అన్నారు. నటీనటులు, టెక్నీషియన్లు అందరూ కలిసి ఇలాంటి సహజసిద్ధమైన చిత్రాన్ని తీయడం చూస్తూ ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. ఇలాంటి మంచి సినిమాలలో భాగం కావడానికి తాను ఇష్టపడతానని అన్నారు. చిన్న హీరోల సినిమాలలో తాను నటించనని, తనకు అంత రెమ్యునరేషన్ ఇచ్చుకోలేమనే భావనతో వారు తనను సంప్రదించడం లేదని… ఈ రెండింటిలో నిజం లేదని అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates