HomeTelugu Big Stories'ఆర్‌ఆర్‌ఆర్‌' మేకింగ్‌ వీడియో వచ్చేసింది

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మేకింగ్‌ వీడియో వచ్చేసింది

RRR movie making video ROAR

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మేకింగ్‌ వీడియోను గురువారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ‘రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరుతో బయటకు వచ్చిన ఈ వీడియో అందర్ని ఆకర్షిస్తోంది. చరణ్‌, తారక్‌లకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణను ఇందులో చూపించారు. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ని సైతం ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు రుచి చూపించారు. ఈ ఏడాది అక్టోబరు 13న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం నేడు అధికారికంగా ప్రకటించింది.

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. చరణ్‌కి జోడీగా సీత పాత్రలో బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌ సందడి చేయనున్నారు. అలాగే తారక్‌ ప్రేయసిగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu