HomeTelugu Big Storiesచేయికలిపిన రామ్ - భీమ్..

చేయికలిపిన రామ్ – భీమ్..

RRR movie New poster
ధర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చుస్తున్నారు. కరోనా కారణంగా ఆరు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడి మళ్లీ ఇటీవలే ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్ ఈ సినిమాపై మరించ అంచనాలు పెంచేశాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి మరో పోస్టర్ విడుదలైంది. వెనుక అశోక ధర్మ చక్రం, ముందు అల్లూరి, భీమ్ చేతులు కలిపినట్లు ఉన్న ఈ పోస్టర్ నెటిజన్‌లను ఆకట్టుకుంటుంది

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారిద్దరు కలిసిన సీన్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలోంచి ఇప్పటికే చరణ్‌ పాత్రను ‘అల్లూరి సీతారామరాజు’ పరిచయం చేస్తూ టీజర్ విడుదలైంది. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu