HomeTelugu Trending'ఆర్‌ఆర్‌ఆర్‌' ట్రైలర్‌ వాయిదా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ వాయిదా

RRR movie trailer postponed

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా థియేటరికల్‌ ట్రైలర్‌ వాయిదా పడింది. ఈ సినిమా ట్రైలర్‌ని డిసెంబర్‌ 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించినప్పటికీ.. ప్రముఖ సినీ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు కొన్ని అనుకోని కారణాల వల్ల ట్రైలర్‌ విడుదల వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. త్వరలో ట్రైలర్‌ విడుదల తేదీని ప్రకటిస్తామని తెలియజేసింది.

సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఆలియాభట్‌ ఈసినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె చరణ్‌కు జోడీగా కనిపించనున్నారు. తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu