HomeTelugu Trendingఆగిపోయిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' టెస్ట్‌ షూట్‌?

ఆగిపోయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టెస్ట్‌ షూట్‌?

1 16దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరక్కెకిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా టెస్ట్ షూట్‌ను రెండు రోజుల పాటు నిర్వహించాలని ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ హీరోల ప్లేస్‌లో డూస్‌లను ఉపయోగించి ప్రభుత్వ నియమాలను ఫాలో అవుతూ.. షూటింగ్ చేయాలని జక్కన్న భావించాడు. అందుకు రెడీ అయ్యి పోలీసుల నుండి అనుమతుల కోసం ప్రయత్నించాడు.

కాగా హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తుందనే కారణమో లేదంటే ఇతర కారణాలో తెలియదు కాని ‘ఆర్ఆర్ఆర్’ ట్రయిల్ షూట్ ఆగిపోయినట్లు తెలుస్తుంది. షూటింగులకు అనుమతిస్తే ప్రమాదం ఎలా ఉంటుందోనన్న ఆందోళనా పోలీసుల్లో వ్యక్తమవుతోందట. అందుకే ఇంకా టెస్ట్ షూట్ అనుమతుల ఇవ్వలేదని సమాచారం. కాగా టాలీవుడ్‌లో ఇప్పటికే సినిమా షూటింగ్‌లకు అనుమతులు వచ్చినా…ఎవరూ షూటింగ్స్ నిర్వహించడం లేదు. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ తగ్గాకే షూటింగ్స్ ప్రారంభించడం బెటర్ అని మేకర్స్ అభిప్రాయ పడుతున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu