HomeTelugu Trending'ఆర్‌.ఆర్‌.ఆర్‌' క్లైమాక్స్ మొదలైంది‌.. రాజమౌళి ట్వీట్‌

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ క్లైమాక్స్ మొదలైంది‌.. రాజమౌళి ట్వీట్‌

The CLIMAX shoot has begun
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్‌.ఆర్‌’. ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలు కూడా వేచి చూస్తున్నాయి. మరో రెండు మూడు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చుండేది. కానీ కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. కాగా గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ అన్ని జాగ్రత్తల మధ్య జరుగుతుంది. దానికితోడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. మధ్యలో రాజమౌళికి కరోనా రావడం.. నిర్మాత దానయ్య కూడా కోవిడ్ బారిన పడటంతో షూటింగ్ విషయమే అంతా మరిచిపోయారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా కోవిడ్ బారిన పడటంతో ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ మరింత ఆలస్యం అయింది. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. రాజమౌళి తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ క్లైమాక్స్ మొదలు పెట్టాడు. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా ట్రిపుల్ ఆర్ టీమ్‌ నుంచి వచ్చేసింది.

క్లైమాక్స్ మొదలైంది.. నా రామరాజు, భీమ్ ఇద్దరూ వాళ్లు కోరుకున్న దానికోసం యుద్ధం మొదలు పెట్టారు అంటూ రాజమౌళి ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ క్లైమాక్స్ షూటింగ్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పాల్గొంటున్నారు. 2022లో ఈ సినిమాను విడుదల చేయనున్నాడు జక్కన్న. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu