HomeTelugu Trending'సాహో' తొలి పాట 'కాదల్‌ సైకో' వచ్చేస్తోంది!

‘సాహో’ తొలి పాట ‘కాదల్‌ సైకో’ వచ్చేస్తోంది!

1 3యంగ్‌ రెబెల్‌స్టార్ ప్రభాస్‌, బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న ‘సాహో’ సినిమాలోని తొలి పాట వచ్చేస్తోంది. ‘కాదల్‌ సైకో’ అంటూ సాగే ఈ పాట టీజర్‌ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఈ పాటకు సంబంధించిన ప్రభాస్‌, శ్రద్ధాల పోస్టర్లను షేర్‌ చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ కొత్తగా కనిపిస్తున్నారు. రెండు పాటలు మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆస్ట్రియాలో ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతోందని ప్రభాస్‌ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu