యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న’సాహో’ను థ్రిల్లింగ్ గా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ తో పాటు సూపర్ లావిష్ స్టైలిష్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 30 వ తేదీన సినిమా విడుదల కాబోతున్నది. మొన్నటి వరకు ప్రభాస్ కు సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేస్తూ వచ్చిన యూనిట్ నిన్న విలన్ లుక్ ఒకటి విడుదల చేసింది. నీల్ నితీష్ లుక్ స్టైలిష్ గా ఉన్నది.
కాగా ఈరోజు సెకండ్ విలన్ అరుణ్ విజయ్ కు చెందిన లుక్ ను రిలీజ్ చేసింది. హెలికాఫ్టర్ నుంచి దిగి వస్తున్న పోస్టర్ అది. అద్భుతంగా ఉంది ఈ పోస్టర్. విలన్ అంటే భీకరంగా చూపించే సినిమాలు చూశాం. కానీ, ఇటీవల వస్తున్న సినిమాల్లో విలన్ అంటే … హీరోతో పాటు స్టైలిష్ గా ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.