HomeTelugu Big Storiesపుష్ప: 'సామీ సామీ' సాంగ్‌ వచ్చేసింది

పుష్ప: ‘సామీ సామీ’ సాంగ్‌ వచ్చేసింది

Saami Saami song from Push
దర్శకుడు సుకుమార్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ‘పుష్ప’ నుంచి విడుదలైన.. దాక్కో దక్కో మేక’, ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే’పాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్‌ సింగిల్‌ ‘సామీ సామీ’ పాటను విడుదల చేశారు.

‘నువ్వు అమ్మి అమ్మి అంటాంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ.. నిను సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామీ’ అంటూ సాగే ఈ సాంగ్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తుండగా.. మొదటి భాగం డిసెంబర్‌ 17న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu