బాహుబలి ఛాన్స్ వదులుకొని బాధపడుతోంది!

రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రానికి ప్రపంచవ్యాతంగా ఎంతటి గుర్తింపు లభించిందో
అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నానని ఇప్పుడు
సోనమ్ కపూర్ తెగ బాధ పడిపోతుంది. దక్షిణాదిన మంచి కథ దొరికితే నటిస్తానని తరచూ
చెప్పే సోనమ్ ‘బాహుబలి’ని మాత్రం వదులుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె
వెల్లడించారు. అంత గొప్ప పాత్ర వదులుకోవడం బాధగా ఉందని చెబుతోంది. అయితే
ఆమెను ఏ పాత్ర కోసం అడిగారానే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కానీ అందరూ
కచ్చితంగా అవంతిక పాత్ర కోసమే అడిగి ఉంటారని ఊహించుకుంటున్నారు. ఇది ఇలా
ఉండగా త్వరలోనే ధనుష్ హీరోగా నటిస్తోన్న చిత్రంతో అమ్మడు దక్షిణాదిన ఎంట్రీ
ఇవ్వబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates