‘పుష్ప’: సామీ సామీ సాంగ్‌ ప్రోమో

సుకుమార్ డైరెక్షన్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబర్‌ 17న విడుదలకు సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే పుష్ప నుంచి విడుదల ఫస్ట్‌ సింగిల్‌, సెకండ్‌ సింగ్‌ల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి మరో థర్డ్‌ సింగిల్‌ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.

‘సామీ సామీ’ అనే మాస్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రోమోను విడుదల చేస్తూ అక్టోబర్‌ 28న ఫుల్‌ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రోమో సాంగ్‌ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలో విడుదల చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates