నిర్మాతగా ప్రభాస్‌ సిస్టర్‌

టాలీవుడ్‌లో ఇప్పటికే పలువురు సీనియర్‌ హీరోల డాటర్స్‌ నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్‌ కృష్ణ కూతురు మంజుల, మెహన్‌ బాబు కూతురు మంచు లక్ష్మి ఇప్పటికే నిర్మాతలుగా పలు సినిమాలు చేశారు. ఇటీవలే మెగాస్టార్‌ చింరజీవి పెద్ద కూతురు సుష్మిత కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇక తాజాగా రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు వారసురాలు కూడా నిర్మాతగా మారిపోయింది.

ఇప్పటికే కృష్ణంరాజు తమ్ముడు.. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ‘ప్రభాస్’ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు నిర్మాతగా ఇండస్ట్రీకి వచ్చారు. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో కృష్ణంరాజు నటించే సినిమా నిర్మాణం చూసుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు కృష్ణంరాజు పెద్ద కూతురు ప్రసీద నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అంగేట్రం చేస్తోంది. ప్రభాస్‌ 20వ చిత్రం ‘రాధే శ్యామ్‌’ నిర్మాతల్లో వంశీ, ప్రమోద్‌తోపాటు ప్రసీద కూడా ఉంది. తన సోదరుడు ప్రభాస్‌తో నిర్మాణరంగంలో పనిచేస్తూనే.. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ప్రవేశించే ఆలోచన కూడా ఉందంట.

CLICK HERE!! For the aha Latest Updates