HomeTelugu Trendingరాయలవారి పాత్రలో సాయిధరమ్‌ తేజ్

రాయలవారి పాత్రలో సాయిధరమ్‌ తేజ్

10 4

కథల విషయంలో హీరో సాయిధరమ్‌ తేజ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రతిరోజూ పండగే సినిమాతో విజయాన్ని అందుకున్న సాయిధరమ్ తేజ్ తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన నో పెళ్లి సాంగ్ ఈ మధ్యనే రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో ఓ ఎమోషనల్ మూవీ చేయబోతున్నాడు. త్వరలోనే చారిత్రక కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సాయిధరమ్‌ తేజ్ శ్రీ కృష్ణదేవరాయ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. రాయలవారి పాలన నేపథ్యంలో వీరు పోట్ల ఈ కథను రాసుకున్నాడట. ఈ సినిమాకు రూ.40 కోట్లకు పైగా బడ్జెట్‌ పెట్టబోతున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu