HomeTelugu Trendingసాయి ధరమ్‌ తేజ్‌తో మూవీ.. వెల్లడించిన డైరెక్టర్‌

సాయి ధరమ్‌ తేజ్‌తో మూవీ.. వెల్లడించిన డైరెక్టర్‌

Sai Dharam Tej movie with D

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అక్టోబర్ లో యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ఆ తరువాత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. చాలా రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సాయి తేజ్ ఇటీవల మెగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆయన పూర్తిగా కోలుకున్నట్లు తెలిసింది. అయితే తాజాగా ఓ డైరెక్టర్ సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్ తో పాటు ఆయన నెక్స్ట్ సినిమా గురించి కూడా వెల్లడించారు.

తాజాగా ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన డైరెక్టర్‌ మారుతి సాయి తేజ్ ను తాను కలిశానని, ఆయన ఆరోగ్యం ఇంతకుముందు కన్నా మెరుగ్గా ఉందని, ప్రస్తుతం హుషారుగా ఉన్నారని వెల్లడించారు. అంతేకాదు త్వరలోనే తామిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందని, స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందని వెల్లడించారు. కాగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన “మంచి రోజులొచ్చాయి” చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు గోపీచంద్, రాశి ఖన్నా జంటగా ‘పక్కా కమర్షియల్’ సినిమాను రూపొందిస్తున్నారు మారుతీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu