HomeTelugu Trendingప్రియుడి కోసం నయన్‌ సాహసం..

ప్రియుడి కోసం నయన్‌ సాహసం..

Nayantara in challenging ro
టాలీవుడ్‌లో వెంకటేష్-వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమాలో ఎంట్రీ ఇచ్చింది నయనతార. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో స్టార్‌ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం నయనతార ‘నేత్రికాన్’ ‘మూకుతి అమ్మన్’ చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘అన్నాత్తే’ సినిమాలోనూ నటిస్తుంది. వీటితో పాటు ‘కాతువాకుల రెండు కాదల్’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమా నయన్ బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ డైరెక్షన్‌లో వస్తుంది. ఈ సినిమాలో అంధురాలిగా కనిపించనుందట. గతంలో వచ్చిన నేనే రౌడీ నే అని సినిమాలో వినికిడి లోపం ఉన్న పాత్రలో నటించి అదరగొట్టింది. ఇప్పుడు మళ్ళీ తన లవర్ కోసం నయన్ అంధురాలి పాత్రలో కనిపించడానికి సిద్ధమైయిందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu