HomeTelugu Big Storiesమెగాహీరో కొత్త సినిమా మొదలెట్టాడు!

మెగాహీరో కొత్త సినిమా మొదలెట్టాడు!

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తొలిప్రేమ, బాలు, డార్లింగ్‌ వంటి బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీస్‌ని తెరకెక్కించిన సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌.. సాయిధరమ్‌తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌ శంషాబాద్‌లోని ఐ.ఎం.టి. కాలేజీలో ప్రారంభమైంది. 
ఈ సందర్భంగా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామరావు మాట్లాడుతూ ”మా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో ఇది 45వ సినిమా. ఈరోజు రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాం. కంటిన్యూగా ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. లవ్‌స్టోరీస్‌ స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌గారితో మా బేనర్‌లో రెండో సినిమా చేస్తున్నాం. మళ్లీ మళ్ళీ ఇది రాని రోజు తర్వాత మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌కి మా బేనర్‌లో ఇది రెండో సినిమా. ఇంత మంచి టీమ్‌తో చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను” అన్నారు. 
దర్శకుడు ఎ.కరుణాకరన్‌ మాట్లాడుతూ – ”ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, సెంటిమెంట్స్‌, ఎమోషన్స్‌ కలిసిన యూత్‌ఫుల్‌ కలర్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ఇది” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu