విజయ్ సినిమా వెనక్కి వెళ్లింది!

ఈ దీపావళికి రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ అలానే విజయ్ నటించిన ‘అదిరింది’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడతాయని ఊహించారు. కానీ ఇప్పుడు విజయ్ సినిమా ఒకరోజు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 18న విడుదల కావల్సిన విజయ్ సినిమా ఇప్పుడు అక్టోబర్ 19న విడుదల కాబోతుంది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నిర్మాత శరత్ మరార్ తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు.

అయితే తమిళంలో ఈ సినిమాను అక్టోబర్ 19న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు నిర్మాతలు. దీంతో తెలుగులో కూడా అదే రోజున సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో విజయ్ సరసన సమంత, నిత్యామీనన్, కాజల్ లు హీరోయిన్లుగా కనిపించనున్నారు.

 

CLICK HERE!! For the aha Latest Updates