సన్నీ ఎంత డిమాండ్ చేసిందంటే!

బాలీవుడ్ అందాల తార స‌న్నీ లియోన్ మొద‌టిసారి ఓ చారిత్ర‌క క‌థాంశంతో న‌డిచే సినిమాలో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆమె రూ. 3.25 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం కావ‌డంతో ఆమె అడిగిన మొత్తం ఇవ్వ‌డానికి నిర్మాత స్టీఫెన్ ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం.
ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కు‌డు వడి వుడయన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ చిత్రంలో సన్నీ యువరాణి పాత్రలో నటించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సినిమా చిత్రీకరణ మొదలుకానుంది.