HomeTelugu Trendingనితేశ్‌ తివారీ రామాయణంలో సీతగా సాయి పల్లవి!

నితేశ్‌ తివారీ రామాయణంలో సీతగా సాయి పల్లవి!

sai pallavi in nitesh tiwar

బాలీవుడ్ దర్శకుడ నితేశ్‌ తివారీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌. రావణుడిగా పాత్ర కోసం యష్‌, సీత పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నట్లు టాక్‌. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి.

ఇటివలే సాయి పల్లవి లుక్ టెస్ట్ లో పాల్గొన్నారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సినిమా కోసం సాయి పల్లవి బల్క్ డేట్స్ కేటాయించారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 2024లో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జులైలో యష్ సెట్స్‌లోకి జాయిన్ అవుతాడు.

ఈ సినిమా కోసం మేకర్స్, టాప్ హాలీవుడ్ స్టూడియోస్ కలసి పని చేస్తున్నారు. అయితే కాస్టింగ్ ఎంపిక‌ల గురించి చిత్ర‌బృందం ఇంకా ఎలాంటి వివ‌రాల్ని వెల్ల‌డించ‌లేదు. చాలా కాలం క్రితం ఇందులో శ్రీ‌రాముడి పాత్ర కోసం హృతిక్ రోష‌న్ ని , ప్ర‌భాస్ ని కూడా సంప్ర‌దించార‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu