HomeTelugu Trending‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి సాయిపల్లవి న్యూలుక్‌

‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి సాయిపల్లవి న్యూలుక్‌

Sai pallavi look from Shy
ఫిదా బ్యూటీ సాయి పల్లవి 29వ పుట్టిన రోజు నేడు(మే 09). ఈ సందర్భంగా నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం నుంచి సాయి పల్లవి లుక్‌ విడుదల చేసింది చిత్ర బృందం. శ్యామ్‌ సింగరాయ్‌ పోస్టర్‌ని ట్వీటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే చిన్ని గారు’ అని ట్వీట్‌ చేశాడు. కాళికాదేవి అవ‌తారంలో ఉగ్రరూపం దాల్చినట్లుగా ఉన్న ఈ పోస్టర్‌ ఫ్యాన్స్‌ ఆకట్టుకుంటుంది. పోస్టర్‌ అదిరిపోయిందంటూ సాయి పల్లవి అభిమానులను కొనియాడుతున్నారు. ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో ‘శ్యామ్ సింగ రాయ్‌’ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu