HomeTelugu Trending‘జయమ్మ పంచాయతీ’నుంచి ఫస్ట్‌సాంగ్‌ విడుదల

‘జయమ్మ పంచాయతీ’నుంచి ఫస్ట్‌సాంగ్‌ విడుదల

Nani launches first song of Suma's Jayamma Panchayathi

స్టార్‌ యాంకర్‌ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. కలివారపు విజయ్‌కుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో నటుడు నాని ఈ చిత్రంలోని ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు.‘తిప్పగలనా చూపులు నీ నుంచే ఏ వైపేనా.. ఆపగలనా అడుగులు నా చెంతే కాసేపైనా’ అంటూ సాగే ఈ పాట అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ ఆలపించారు. ఈ సినిమాని వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మిస్తున్నారు. కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: అనుష్‌ కుమార్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu