సాయిపల్లవి విషు లుక్‌ ఫొటోలు.. వైరల్‌!

‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి విషు లుక్‌లో ఉన్న ఫొటోల్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ‘ఈ ఏడాది విషు (ఉగాది) చాలా తొందరగా వచ్చేసింది’ అని ట్వీట్‌ చేశారు. కేరళ సంప్రదాయం ప్రకారం ధరించే బంగారు వర్ణం జరీ ఉన్న తెలుపు రంగు చీరలో ఆమె మెరిశారు. ఈ లుక్‌లో నటి చాలా బాగున్నారని నెటిజన్లు కామెంట్లు చేశారు. కేవలం మూడు గంటల్లోనే 15 వేల మందికిపైగా ఫొటోల్ని లైక్‌ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఫొటో షూట్‌లో భాగంగా ఆమె ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది.

సాయిపల్లవి గత ఏడాది ‘పడి పడి లేచె మనసు’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శర్వానంద్‌ హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. ప్రస్తుతం ఆమె ‘ఎన్జీకే’ చిత్రంలో నటిస్తున్నారు. సూర్య కథానాయకుడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోపక్క మలయాళంలో ‘అథిరన్‌’ అనే చిత్రంలోనూ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు.