HomeTelugu Big StoriesSai Pallavi : స్టార్ హీరో కొడుకుతో సాయి పల్లవి ప్రేమాయణం

Sai Pallavi : స్టార్ హీరో కొడుకుతో సాయి పల్లవి ప్రేమాయణం

Saipallavi with Amir khan's son

Sai Pallavi : ఫిదా బ్యూటీ సాయిపల్లవి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్‌ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సునీల్‌పాండే దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ప్రేమ కథగా తెరకెక్కిస్తున్నారు. హీరో, హీరోయిన్‌ ఇద్దరికీ బాలీవుడ్‌ లో ఇదే తొలి సినిమా.

యశ్‌రాజ్‌ ఫిలింస్ బ్యానర్‌లో వ‌స్తున్న సినిమా షూటింగ్‌ ప్ర‌స్తుతం జపాన్‌లో జ‌రుపుకుంటుంది. జపాన్‌లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో సపోరో స్నో ఫెస్టివల్ జ‌రుగుతుంది. ఈ ఫెస్టివల్‌ను చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు జపాన్‌కు వస్తుంటారు.

అయితే ఈ ఫెస్టివల్‌లోనే సినిమా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈక్రమంలో షూటింగ్‌ బ్రేక్ లో జునైద్ ఖాన్ – సాయి ప‌ల్ల‌వి సపోరో స్నో ఫెస్టివల్‌లో సంద‌డి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‍గా నటిస్తుంది. అలాగే, శివ కార్తికేయ తో కూడా ఓ మూవీకి ఓకే చెప్పింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ దర్శకత్వం వహించే రామాయణం చిత్రంలో సీతాదేవీగా సాయిపల్లవి నటించనున్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu