కౌశల్‌ టాప్-2లో ఉంటారని చెప్పిన జ్యోతిష్కురాలు

ఎన్నో మలుపులు తిరుగుతూ ఫినాలేకు చేరువైన తెలుగు బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్‌-2లో 109వ ఎపిసోడ్‌ సరదాగా గడిచిపోయింది. ఈ ఎపిసోడ్‌లో ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా సాగింది. అలాగే హౌస్‌లోని సభ్యులకు గుడ్‌నైట్ టీ-షర్టులు ఇచ్చారు. వాటిని ధరించిన ఆ టీషర్టులపై అందరి అభిప్రాయాలు రాశారు. ఒక్కో సభ్యుడిపై మిగతా వారి అభిప్రాయాలను ఆ టీషర్ట్‌పై రాశారు.

సభ్యుల్లో ఉండే సందేహాలను తీర్చుకునేందుకు హౌస్‌లోకి బిగ్‌బాస్‌ ఓ ప్రత్యేకమైన వ్యక్తిని పంపించారు. బిగ్‌బాస్ హౌస్ సభ్యులతో మాట్లాడుతూ “ఫినాలేకు కేవలం ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో మీ మదిలో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలతో మీరు ఆందోళనలో ఉండొచ్చు. వీటిన్నిటినీ బిగ్‌బాస్ అర్ధం చేసుకోగలరు. అందుకే బిగ్‌బాస్ మీకోసం ఓ ప్రత్యేక మైన వ్యక్తిని పంపిస్తున్నారు. ఆ వ్యక్తి మీ అన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంతో పాటు మీకు సరైన మార్గాన్ని కూడా చూపిస్తారు అన్నారు. ఇప్పుడు బిగ్‌బాస్ కోరిక మేరకు సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరిగా యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లి ఆ ప్రత్యేక వ్యక్తిని కలవమన్నారు. సామ్రాట్‌తో మొదలు పెట్టమన్నారు.

ఒక్కొక్కరుగా వెళ్లి బిగ్‌బాస్‌ పంపిన ప్రత్యేక వ్యక్తితో తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ముందుగా వెళ్లిన సామ్రాట్ తనకు బయట ఉన్న సమస్యలు, పరిష్కారం అవుతాయా? టాప్‌లో ఉంటానా? నాపై పాజిటివ్ అభిప్రాయం ఉందా? అని అడిగారు. దానికి జ్యోతిష్కురాలు సమాధానం చెబుతూ మీకు హౌస్‌లో అంతా పాజిటివ్‌గా ఉంది. బయట మీకున్న సమస్యలన్నీ 100 పర్సంట్ నెరవేరుతాయి. మీలో నెగిటివిటీ కనిపించడం లేదు అన్నారు.

హౌస్‌లో చూపిస్తున్నదే బయట కనిపిస్తుందా? లేదా వేరేగా ఉంటుందా అన్న గీతామాధురి ప్రశ్నకు.. “బయట తప్పకుండా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. హౌస్‌లో ఉన్నట్లు ఉండదని జ్యోతిష్కురాలు సమాధానమిచ్చారు.

బయట ఎలా ఉంది? ఫినాలేలో టాప్ 2లో ఉంటానా అని కౌశల్ అడిగిన ప్రశ్నకు.. బయట పాజిటివ్ టాక్ ఉంది. తప్పకుండా ఉంటారని జ్యోతిష్కురాలు సమాధానమిచ్చారు.

నాపై అభిప్రాయం ఎలా ఉంది? అని అడిగిన తనీష్ ప్రశ్నకు “పాజిటివ్, నెగటివ్‌లు ఉన్నాయి. చాలా పాజిటివ్‌గా ఉన్నారు. మీకు చాలా సపోర్ట్ ఉంది అని జ్యోతిష్కురాలు సమాధానమిచ్చారు.