HomeTelugu Reviews'శైల‌జా రెడ్డి అల్లుడు' మూవీ రివ్యూ

‘శైల‌జా రెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ

వ‌రుస విజ‌యాల‌తో ఫాంలో ఉన్న యువ ద‌ర్శ‌కుడు మారుతి, అక్కినేని నటవారసుడు నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. తెలుగు తెరపై ఒక‌ప్పుడు సూప‌ర్ హిట్ అయిన అత్త సెంటిమెంట్‌ను మ‌రోసారి రిపీట్ చేస్తూ తెర‌కెక్కించిన ఈ సినిమాలో అత్త పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించారు. మ‌రి హిట్ ఫార్ములా నాగ‌చైత‌న్య కెరీర్‌లో మ‌రో హిట్‌గా నిలుస్తోందా.. ర‌మ్య‌కృష్ణ అత్త పాత్ర‌లో ఎలా నటించారు… మారుతి త‌న స‌క్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడా.?

9a 2

క‌థ :
భయంకరమైన ఇగో ఉన్న సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మెన్‌ రావు(మురళీ శర్మ) కొడుకు చైతన్య (నాగ చైతన్య ). తన ఇగో కోసం కూతురు పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకునేంత ఇగో రావుది. తన కాలనీ లోకి కొత్తగా వచ్చిన అను(అను ఇమ్మాన్యూల్) అనే అమ్మాయిని తొలిచూపులోనే ఇష్టపడతాడు చైతూ.. అనుకి కూడా తన తండ్రిలాగే భరించలేనంత ఇగో ఉందని తెలిసి పని మనిషిని ప్రేమిస్తున్నట్లుగా నాటకమాడి అనుని ప్రేమలోకి దించుతాడు. అనుకి కూడా తనలాగే ఇగో ఎక్కువ అని తెలుసుకున్న రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఫ్యామిలీ ఫంక్షన్‌లో అను పర్మిషన్ లేకుండా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసేస్తాడు. అదే సమయంలో అను.. వరంగల్ జిల్లాను శాసించే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ) కూతురు అని తెలుస్తోంది. తనకి తెలియకుండా ఏది జరగడానికి ఇష్టపడని శైలజా రెడ్డి… చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుందా..? ఇగోని పక్కన పెట్టి శైలజా రెడ్డి, రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకున్నారా? అన్నదే మిగతా కథ.

9b 2

న‌టీన‌టులు:
సినిమాలో చాలామంది న‌టులు ఉన్నా సినిమా మొత్తం ముఖ్యంగా నాగ‌చైత‌న్య‌, ర‌మ్య‌కృష్ణ‌, అను ఇమ్మాన్యుయేల్‌ చుట్టూనే తిరుగుతుంది. కాబోయే అత్త‌, ప్రియురాలి మ‌ధ్య న‌లిగిపోయే పాత్ర‌లో నాగ చైత‌న్య మంచి న‌ట‌న క‌న‌బ‌రిచాడు. గ‌త చిత్రాల‌తో పోలిస్తే న‌టనా పరంగా మంచి ప‌రిణ‌తి క‌న‌బ‌రిచాడు. కామెడీ టైమింగ్‌తోనూ ఆక‌ట్టుకున్నాడు. క‌మ‌ర్షియల్ ఫార్మాట్ సినిమా కావ‌టంతో డ్యాన్సులు, ఫైట్స్‌కు కూడా మంచి అవ‌కాశం ద‌క్కింది. ఇక కీల‌క‌మైన అత్త పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ మ‌రోసారి తన సత్తా చూపించారు. భరించ‌లేనంత ఇగోతో అంద‌రినీ ఇబ్బంది పెట్టే పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌ట‌న అంద‌రినీ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చినా అందరినీ డామినేట్ చేసేశారు. ఎమోష‌న‌ల్ సీన్స్‌లోనూ త‌న ఎక్స్‌పీరియ‌న్స్‌ను చూపించారు. ఇగో విష‌యంలో అమ్మ‌తో తలప‌డే పాత్రలో అను ఇమ్మాన్యూల్ ఆకర్షిస్తుంది. ర‌మ్య‌కృష్ణ‌తో పోటీప‌డి న‌టించే సీన్స్‌లో కాస్త తేలిపోయినట్టుగా అనిపించినా.. గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. మొదటి భాగంలో మురళీ శర్మ కూడా రమ్యకృష్ణ రేంజ్‌లో ఇగో చూపించారు. హీరోయిన్ తండ్రిగా న‌రేష్ మ‌రోసారి త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించారు. వెన్నెల కిశోర్, 30 ఇయ‌ర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వాళ్ల కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా న‌వ్వించారు.

9 10

విశ్లేష‌ణ
గ‌త చిత్రాల్లో హీరోల‌కు డిఫెక్ట్ చూపించిన ద‌ర్శ‌కుడు మారుతి ఈ సినిమాలో లేడి క్యారెక్ట‌ర్స్ కు కూడా డిఫెక్ట్ ను యాడ్ చేశాడు. విప‌రీత‌మైన ఇగో ప్రాబ్లమ్‌తో అంద‌రినీ ఇబ్బందులు పెట్టే అత్త పాత్ర‌ను అద్భుతంగా డిజైన్ చేశాడు. గ‌త చిత్రాల విష‌యంలో కామెడీ మీదే ఎక్కువ‌గా దృష్టి పెట్టిన మారుతి ఈ సినిమాను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మలిచాడు. తొలి భాగం హీరో హీరోయిన్‌ ల‌వ్ స్టోరి, రొమాటింక్ సీన్స్‌తో సాగదీసిన ద‌ర్శ‌కుడు.. కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ద్వితీయార్థంలోనూ కామెడీ కంటిన్యూ చేస్తూ యాక్ష‌న్, ఎమోష‌న‌ల్ సీన్స్‌తో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా అంతా 90లలో వచ్చిన కమర్షియల్ ఫార్ములా సినిమాలను గుర్తు చేస్తుంది. సినిమాకు మ‌రో మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్ కామెడీ. మారుతి త‌న మార్క్ కామెడీతో క‌డుపుబ్బా న‌వ్వించాడు. క్లైమాక్స్‌లో శైలజారెడ్డి, రావు మనసు మార్చుకొని పెళ్లికి ఒప్పుకునే సన్నివేశం అంత సహజంగా అనిపించదు. గోపిసుంద‌ర్ త‌న ట్యూన్స్‌తో మ‌రోసారి మ్యాజిక్ చేశాడు. టైటిల్ సాంగ్ తో పాటు అనుబేబి, ఎగిరే పాటలు విజువ‌ల్‌గా కూడా బాగున్నాయి. సినిమాటోగ్ర‌ఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి.

హైలైట్స్
అత్త, అల్లుడి పాత్ర
అను గ్లామర్, సాంగ్స్

బ్యాక్‌డ్రాప్స్
పస్టాఫ్‌లో సాగదీసే సన్నివేశాలు
క్లైమాక్స్

చివరిగా : అంతగా మెప్పించలేకపోయిన శైలజారెడ్డి అల్లుడు
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

చిత్రం: శైలజారెడ్డి అల్లుడు
న‌టీన‌టులు: నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ, నరేష్, మురళీశర్మ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
ద‌ర్శ‌క‌త్వం: మారుతి
నిర్మాత‌లు: ఎస్.రాధాకృష్ణ, పీడీవీ ప్రసాద్, సురేష్ నాగ వంశీ

Recent Articles English

Gallery

Recent Articles Telugu

వ‌రుస విజ‌యాల‌తో ఫాంలో ఉన్న యువ ద‌ర్శ‌కుడు మారుతి, అక్కినేని నటవారసుడు నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. తెలుగు తెరపై ఒక‌ప్పుడు సూప‌ర్ హిట్ అయిన అత్త సెంటిమెంట్‌ను మ‌రోసారి రిపీట్ చేస్తూ తెర‌కెక్కించిన ఈ సినిమాలో అత్త పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించారు. మ‌రి హిట్ ఫార్ములా నాగ‌చైత‌న్య కెరీర్‌లో మ‌రో హిట్‌గా నిలుస్తోందా.. ర‌మ్య‌కృష్ణ అత్త...'శైల‌జా రెడ్డి అల్లుడు' మూవీ రివ్యూ