‘ఒరేయ్‌ బుజ్జిగా’ మూవీ రివ్యూ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ తాజా చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. ఈ రోజు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

కథ: బుజ్జి(రాజ్ తరుణ్), కృష్ణవేణి (మాళవిక నాయర్) ఒకే ఊరికి చెందిన వారు అయిన ఒకరికి ఒకరు పరిచయం ఉండదు. ఇంట్లో నచ్చని పెళ్లి చూపుల నుంచి తప్పించుకునేందుకు తల్లిదండ్రులకు చెప్పకుండా సిటీకి వెళ్లిపోతారు. ఐతే శ్రీనివాస్-బుజ్జి ప్రేమించుకున్నారని.. వాళ్లిద్దరూ కలిసి లేచిపోయారిన ఊర్లో ప్రచారం జరగడంతో ఇద్దరూ ఇబ్బందుల్లో పడతారు. అయితే బుజ్జి.. కృష్ణవేణి తామిద్దరం ఒకే ఊరి వాళ్లమని – తామిద్దరం లేచిపోయామని ఊరి జనాలు అనుకుంటున్నారని తెలియకుండా రైల్లో కలిసి ప్రయాణం చేస్తారు. వాళ్లిద్దరికీ పరిచయం అయి స్నేహితులుగా మారతారు. కొంత కాలానికి ఇద్దరి మధ్య ప్రేమ కూడా పుడుతుంది. ఈ లోపు ఊరిలో పరిణామాలు తీవ్ర రూపం దాలుస్తాయి. బుజ్జి మీద కృష్ణవేణికి విపరీతమైన కోపం వస్తుంది. అదే సమయంలో తాను ప్రేమలో ఉన్న అమ్మాయే కృష్ణవేణి అని బుజ్జికి తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో అతనేం చేశాడు.. వీళ్లిద్దరి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది కథలోని అంశం.

నటీనటులు: రాజ్ తరుణ్ ఎప్పటిలాగానే తన నటనతో మెప్పించాడు. ఇక మాళవిక నాయర్ తన నటనతో ఆకట్టుకుంది. హెబ్బా కనిపించిన కాసేపు కొంచెం గ్లామర్ విందు చేస్తుంది. సప్తగిరి, సత్య, పోసాని, నరేష్ లాంటి వాళ్లున్నా ఉన్నంతో కామెడీ బాగానే పండించారు.

విశ్లేషణ: దర్శకుడు విజయ్‌ కుమార్‌కు మూడో సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’. ఫస్ట్‌లో ఆసక్తికరంగా అనిపించినా.. తర్వాత నెమ్మదిగా ట్రాక్ తప్పే ‘ఒరేయ్ బుజ్జిగా’ ఎక్కడా మళ్లీ ట్రాక్ ఎక్క లేదు. ద్వితీయార్ధం అయితే మరీ బోరింగ్ గా తయారైపోయింది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టే పెరిగే సన్నివేశాలు కానీ.. తర్వాత వాళ్ల మధ్య సంఘర్షణ తలెత్తి విడిపోయే సీన్లు కూడా ఎఫెక్టివ్ గా లేవు.

టైటిల్: ‘ఒరేయ్ బుజ్జిగా’
న‌టీన‌టులు: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా, పోసాని కృష్ణమురళి తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాత‌లు: కె.కె.రాధామోహన్
సంగీతం: అనూప్ రూబెన్స్
విడుద‌ల‌: అమెజాన్ ప్రైమ్‌

హైలైట్స్: హీరో,హీరోయిలు
డ్రాబ్యాక్స్: కొత్తదనం లేకపోవడం

చివరిగా: పర్వాలేదని పించిన ‘ఒరేయ్ బుజ్జిగా’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

CLICK HERE!! For the aha Latest Updates