HomeTelugu Big Storiesప్రభాస్‌ బర్త్‌డేకి 'సలార్‌' ట్రైలర్‌

ప్రభాస్‌ బర్త్‌డేకి ‘సలార్‌’ ట్రైలర్‌

salaar movie trailer update
పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆస్తికగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో బొగ్గు గనుల నేపథ్యంలో నడిచే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫస్ట్‌ పార్టును డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదలకి ఇంకా రెండు నెలల వరకూ సమయం ఉంది. అందువలన ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టాలని ఈ సినిమా టీమ్ భావిస్తోందని అంటున్నారు. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

మాస్ ఆడియన్స్ ఆశించినట్టుగానే ఈ సినిమాలో ప్రభాస్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది. ఒక కీలకమైన పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ కనిపించనున్నాడు. రవి బస్రూర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu