గౌతమ్ తో విక్రమ్!

తన కథల్లో కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు నటుడు విక్రమ్. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను 
ఎప్పుడు ఎంటర్టైన్ చేసే విక్రమ్ తన గెటప్స్ విషయంలో కూడా నవ్యత చూపిస్తుంటాడు. అలాంటి 
కథలనే ఎక్కువగా ఎన్నుకుంటూ ఉంటాడు. ఈ కోవలోనే ప్రస్తుతం ఆయన హాలీవుడ్ లో వచ్చిన 
‘డోంట్ బ్రీత్’ అనే చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. అలానే తన తదుపరి సినిమాను 
దర్శకుడు గౌతమ్ మీనన్ తో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గౌతమ్ చిత్రాల్లో హీరోను ఎంతో 
స్టయిలిష్ గా ప్రెజంట్ చేస్తాడు. క్యారెక్టర్ డిజైన్ చేసే తీరు కూడా కొత్తగా ఉంటుంది. అలాంటి ఓ 
కథను గౌతమ్ ఇటీవల విక్రమ్ కు వినిపించడం.. దానికి ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని 
చెబుతున్నారు. విక్రమ్ ఈ కథ పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా చర్చల 
దశల్లోనే ఉందని ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని గౌతమ్ మీనన్ చెబుతున్నా… ఈ సినిమా 
పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.