HomeTelugu Big Stories'సలార్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘సలార్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Salaar release date
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం సలార్‌. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. నేడు.. ఇండిపెండెన్స్‌డే రోజున చిత్ర యూనిట్ గుడ్‌న్యూస్ చెప్పింది. సలార్‌ విడుదల తేదీను ప్రకటించి ఫ్యాన్స్‌లో జోష్‌ నింపింది. భారీ బడ్జెట్‌తో పాన్‌ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కేజీఎఫ్2 తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. కాగా శృతీ హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu