ఆ రెండు పవన్ తో చేయాల్సిన సినిమాలట!

రామ్ చరణ్ హీరోగా గతంలో ‘రచ్చ’ సినిమాను రూపొందించాడు దర్శకుడు సంపత్ నంది. ఈ సినిమాతో ప్రేక్షకుల్లో మాస్ ఇమేజ్ ను దక్కించుకున్నాడు రామ్ చరణ్. నిజానికి ఆ సినిమా తరువాత సంపత్ నంది పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నాడు. దానికి
పవన్ కూడా సరే అని కథలు కూడా విన్నాడు. కానీ పవన్ కు వినిపించిన రెండు కథలు కూడా ఆయనకు నచ్చకపోవడంతో వీరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కలేదు.

కానీ పవన్ నో చెప్పాడని సంపత్ నంది నిరాశ పడకుండా ఆ రెండు కథలు వేరే హీరోలతో చేసి దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు. ఆ రెండు కథలు మరేవో కాదు రవితేజ నటించిన ‘బెంగాల్ టైగర్’, అలానే ప్రస్తుతం గోపిచంద్ నటిస్తోన్న ‘గౌతమ్ నందా’ సినిమాలు. బెంగాల్ టైగర్ మంచి విజయాన్నే దక్కించుకుంది. ఇక రెండో సినిమా త్వరలోనే విడుదల కానుంది. మొత్తానికి పవన్ కాదన్న రెండు కథలు తెరమీదకి తీసుకొచ్చేశాడు సంపత్ నంది.