అఖిల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

అఖిల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..? 
అక్కినేని అఖిల్, వినాయక్ దర్శకత్వంలో నటించిన తన మొదటి సినిమా ‘అఖిల్’ నిరాశ పరచడంతో 
నాలుగడుగులు వెనక్కి వేశాడు. రెండో సినిమాతో హిట్ కొట్టకపోతే వెనకే ఉండిపోవాల్సి వస్తుందని
జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అయితే ఈసారి తన రెండో సినిమాతో తమిళంలోనూ ఎంటర్ 
అవ్వాలని భావిస్తున్నాడు. అందుకే ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో 
అఖిల్ తో పాటు తమిళం హీరో కార్తీ నటించనున్నాడనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇదివరకు 
నాగార్జున, కార్తీతో కలిసి ‘ఊపిరి’ సినిమాలో నటించాడు. అప్పుడే అఖిల్, కార్తిల సినిమా ప్రస్తావన కూడా 
వచ్చిందట. ప్రస్తుతం కార్తీ వరుస ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. ఉన్న కమిట్మెంట్స్ పూర్తి 
చేయాలని కొత్తగా ఏ సినిమాలు ఒప్పుకోవట్లేదు. మరి అఖిల్ సినిమా కోసం కార్తీ దగ్గర కాల్షీట్స్ 
ఉన్నాయో లేదో.. ఇప్పుడు ఈ సినిమా కార్తీ చేతుల్లో ఉందనే చెప్పాలి!
CLICK HERE!! For the aha Latest Updates