HomeTelugu Trending'సలార్‌' మూవీ యూనిట్‌కి రోడ్డు ప్రమాదం

‘సలార్‌’ మూవీ యూనిట్‌కి రోడ్డు ప్రమాదం

Accident to Salaar movieయంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న ‘సలార్’ మూవీ యూనిట్ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీనగర్ కాలనీ వద్ద ఫిబ్రవరి 2న రాత్రిసమయంలో ఈ ప్రమాదం జరిగింది. చిత్ర యూనిట్ ప్రయాణిస్తున్న వ్యాన్ యూటర్న్ తీసుకుంటుండగా.. లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో.. నలుగురు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. వాహనం స్వల్పంగా దెబ్బతిన్నది. వారిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రామగుండం ఓపెన్ కాస్ట్ గనిలో ‘సలార్’ చిత్ర షూటింగ్ ముగించుకుని గెస్ట్ హౌస్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా ‘ఆది పురుష్’ సెట్‌లో కూడా నిన్న (మంగళవారం) అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu