HomeTelugu Newsదగ్గుబాటి వారి పెళ్ళిలో సందడి చేసిన సల్మాన్ ఖాన్

దగ్గుబాటి వారి పెళ్ళిలో సందడి చేసిన సల్మాన్ ఖాన్

1 22ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రీత వివాహ మహోత్సవ కార్యక్రమం జైపూర్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రీత వివాహం జరుగుతున్నది. ఆశ్రీత, వినాయక్ ల ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో.. పెద్దల కుదిరించిన ప్రేమ వివాహంగా నిర్వహిస్తున్నారు.

జైపూర్ లో భారీ ఎత్తున వివాహ మహోత్సవ కార్యక్రమాలను ప్లాన్ చేశారు. దగ్గుబాటి కుటుంబంతో పాటు అక్కినేని కుటుంబం ఈ వేడుకలో సందడి చేసింది. రానా.. నాగచైతన్య.. సమంతలు ఈ వేడుకలో ధూమ్ ధామ్ చేశారు. జైపూర్ లో జరుగుతున్న వివాహ మహోత్సవ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు.

సల్మాన్.. వెంకటేష్ లు మంచి స్నేహితులు. ఈ స్నేహంతో సల్మాన్ ఖాన్ ఈ వేడుకకు హాజరయ్యి సందడి చేశారు. సల్మాన్, వెంకటేష్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

1a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu