HomeTelugu Big Storiesకిచెన్‌, బాత్‌రూమ్‌ శుభ్రం చేసిన సల్మాన్‌ ఖాన్‌.. వీడియో వైరల్‌

కిచెన్‌, బాత్‌రూమ్‌ శుభ్రం చేసిన సల్మాన్‌ ఖాన్‌.. వీడియో వైరల్‌

1 30
బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వంటగదిని, బాత్‌రూమ్‌ను శుభ్రం చేశారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 13’. కంటెస్టెంట్స్‌ హౌస్‌ను శుభ్రంగా ఉంచుకోకపోవడంతో సల్మాన్‌నే స్వయంగా అక్కడికి వెళ్లి వంటగదిని, బాత్‌రూమ్‌ను శుభ్రం చేశారు. అంతేకాకుండా కంటెస్టెంట్స్‌ తిన్న ప్లేట్స్‌ను కూడా సల్మానే కడిగారు. అయితే, సల్మాన్‌ హౌస్‌లోకి ప్రవేశించే సమయంలో కంటెస్టెంట్స్‌ అందరూ బెడ్‌రూమ్‌లో ఉన్నారు. సల్మాన్‌ అక్కడికి చేరుకోగానే బెడ్‌రూమ్‌ తలుపులు మూసుకుపోయాయి. వంటగది, బాత్‌రూమ్‌ను శుభ్రం చేసి సల్మాన్‌ అక్కడి నుంచి బయటకు రాగానే బెడ్‌రూమ్‌ తలుపులు తెరుచుకున్నాయి. సల్మాన్‌ చేసిన పనితో షాకైన కంటెస్టెంట్స్‌.. ఆయనకు క్షమాపణలు తెలిపారు. కానీ, సల్మాన్‌ మాత్రం వారి క్షమాపణలను అంగీకరించలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల సల్మాన్‌ నటించిన ‘దబంగ్‌ 3’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్‌కు జంటగా సోనాక్షి సిన్హా నటించారు. క్రిస్మస్‌ కానుకగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. త్వరలో సల్మాన్‌ ‘రాధే’ సినిమాలో నటించనున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో సల్మాన్‌కు జంటగా దిశాపటానీ నటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu