‘సైరా’ రికార్డులు సృష్టిస్తోంది!

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన 151వ సినిమాకు సిద్ధమవుతున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ‘సై రా నరసింహారెడ్డి’ సినిమాను రామ్ చరణ్ తన సొంత బ్యానర్ లో నిర్మించనున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ లోగోతోనే సంచలనం సృష్టించగా ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే రికార్డులు సృష్టిస్తుంది సైరా.

ఏకంగా 2.90 కోట్ల రూపాయల ఆడియో రైట్స్ ప్రైజ్ ఆఫర్ చేశారట. ఆదిత్య, లహరి ఆడియో సంస్థల మధ్య ఈ సైరా ఆడియో ఫైట్ జరుగగా ఫైనల్ గా లహరి మ్యూజిక్ సైరా ఆడియోని సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.  మొత్తానికి సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే సైరా ఆడియో రైట్స్ తో సంచలనాలు సృష్టిస్తుంది. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా నటిస్తున్నాడు అంటూ కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి. అది కూడా నిజమే అయితే ఇక సైరా సినిమా మెగా అభిమానులకు కన్నుల పండుగ లాంటి సినిమా అవుతుందని చెప్పొచ్చు.