HomeTelugu Big Storiesచిరంజీవి సినిమాలో సల్మాన్‌ఖాన్‌

చిరంజీవి సినిమాలో సల్మాన్‌ఖాన్‌

Salman Khan in the movie Ch
మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ నటించే అవకాశాలున్నాయంటూ ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. వీటిపై సంగీత దర్శకుడు తమన్‌ స్పష్టతనిచ్చారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడుతూ చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌ కలిసి నటిస్తున్నారని వెల్లడించారు. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా డైరెక్షన్లో వస్తున్న చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. సూపర్‌హిట్‌ మలయాళ చిత్రం ‘లూసీఫర్‌’ రీమేక్‌గా రూపొందుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులోనే సల్మాన్‌ఖాన్‌ కనిపించనున్నారు. అంతేకాదు ఈ ఇద్దరూ కలిసి ఓ హుషారైన గీతానికి డ్యాన్స్‌ చేయబోతున్నారని, ప్రముఖ పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌తో ఈ పాటని పాడించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తమన్‌ తెలిపారు. ఆమెతో తెలుగు పాట పాడించాలా? ఇంగ్లిష్‌ సాంగ్‌ పాడించాలా? అనే విషయంలో ఇంకా స్పష్టతరాలేదన్నారు.

ఈ సినిమా పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోంది. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణలో ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘ఆచార్య’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకురానుంది. మెహర్ రమేశ్‌ దర్శకత్వంలో చిరు ప్రకటించిన ‘భోళా శంకర్‌’ చిత్రం గురువారం పట్టాలెక్కింది. వీటితోపాటు దర్శకుడు కె.ఎస్‌. రవీంద్ర (బాబీ)తో చిరు ఓ చిత్రం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu