ఎన్టీఆర్ పై కోపంతోనే అలా అన్నాడా..?

జనతా గ్యారేజ్ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇప్పటివరకు తన తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా దర్శకుడు హరి పేరు కాస్త గట్టిగానే వినిపించింది. సింగం సిరీస్ ను తెరకెక్కిస్తోన్న హరిని పిలిచి ఎన్టీఆర్ ఓ  పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ చెప్పమన్నాడని.. దానికి ఆయన ఓకే అన్నాడని వార్తలు వినిపించాయి. వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయితే టెంపర్ తరువాత  న్టీఆర్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా మెప్పిస్తాడని అందరూ భావించారు. కానీ అసలు ఎన్టీఆర్ గురించి తనకేం తెలియదు అంటున్నాడు  దర్శకుడు హరి. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేసిన ‘సింగం3’ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హరిని ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..? నిజమేనా అని  ప్రశ్నించగా.. అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి తనకు తెలియదని, తనను ఇప్పటివరకు కలవలేదని కామెంట్ చేశారు. దీంతో ఎన్టీఆర్  అభిమానులు హరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గతంలో హరి, ఎన్టీఆర్ తో సినిమా చేద్దామని అతడి అపాయింట్మెంట్ అడిగారట. ఆ  విషయాన్ని ఎన్టీఆర్ పట్టించుకోలేదని ఆ కోపంతోనే ఇప్పుడు మీడియా ముందు ఎన్టీఆర్ ఎవరో తెలియనట్లు స్టేట్మెంట్స్ ఇచ్చారని అంటున్నారు.  మొత్తానికి ఎన్టీఆర్ ఎవరో తెలియదని చెప్పి హరి నోరు జారాడనే చెప్పాలి. ఈ విషయం ఇంకెక్కడి వరకు వెళ్తుందో చూడాలి!